KKD: కరప మండలం ఉప్పలంక మొండి వద్ద ఈ నెల 29న చొల్లంగి అమావాస్య తీర్థం జరుగనుందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి శనివారం తెలిపారు. 50 వేల మందికి పైబడి భక్తులు వస్తారని అంచనా. పవిత్ర గోదావరి, సముద్రం కలిసే ప్రాంతంలో స్నానాలాచరించి ఇక్కడ వెలిసిన సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.