EG: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో కిశోరి వికాసం వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంను మంగళవారం గౌరీపట్నం అంగన్వాడి సెంటర్ -1 లో నిర్వహించారు. కిశోరి బాల బాలికలకు, ఆత్మ విశ్వాసం, స్వీయరక్షణనైపుణ్యాలు, మంచిపనులు, సరైన నిర్ణయాలు, సామర్థ్యాలు అంశాలను అంగన్వాడి సూపర్ వైజర్ శశికళ వివరించారు. బాలల పరిరక్షణ విభాగఅధికారి కాంతిలాల్ పాల్గొన్నారు.