ATP: తాడిపత్రి మండలంలోని చీమలవాగులపల్లి గ్రామంలో పోచంరెడ్డి రామాంజుల రెడ్డి, తులసమ్మ దంపతులకు విజయమ్మ జన్మించారు. ఆమె 1971లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. విజయమ్మకు కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల ఉన్నారు. రాజకీయంగా ఆమె కుటుంబానికి విశేష గుర్తింపు ఉంది.