PPM: పార్వతీపురంలో ఉన్న బైపాస్ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ కార్యవర్గ సభ్యులు RVS కుమార్ అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల ఈ గుంతల్లో బైక్ స్లిప్ కావడంతో పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.