అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రిసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో కేటాయించిన 121.53 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సంస్థ అంతర్గత కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూమిని ఇకపై అంతరిక్ష, రక్షణ రంగ ప్రాజెక్టుల ఏర్పాటుకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.