CTR: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ -1 పరీక్ష మంగళవారం వెదురుకుప్పం (M) చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. ప్రిన్సిపల్ నిర్మలా కుమారి మాట్లాడుతూ.. 143 మంది విద్యార్థులలో 139 మంది హాజరయ్యారని, నలుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. ఎస్ఐ నవీన్ బాబు సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు.