అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారికి విశాఖ నగరం చిన్న వాల్తేరుకు చెందిన పల్లా వెంకట చంద్రశేఖర్ శుక్రవారం 40 గ్రాముల బరువు గల రెండు బంగారు మంగళసూత్రాలు వితరణగా అందజేశారు. వీటిని అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి వై.శ్రీధర్‌కు వాటిని అందజేశారు.