W.G: యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయడంతో గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు స్పందించారు. యలమంచిలి, అత్తిలి, కైకలూరులో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం అప్రజాస్వామికమన్నారు. పూర్తి మెజారిటీ ఉన్న వైసీపీకి టీడీపి, జనసేన సభ్యులను బెదిరించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.