KRNL: కౌతాళం మండలం నడిచాగిలోని ప్రైవైట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లి బడిగ ఫాతిమాకు జమ కావాల్సిన తల్లికి వందనం డబ్బులు అదే గ్రామానికి చెందిన తోగట వరలక్ష్మి ఖాతాలో జమయ్యయి. గమనించిన ఆమె నగదును పాఠశాల హెచ్ఎం సమక్షంలో ఫాతిమా కుటుంబీకులకు అప్పగించారు. వరలక్ష్మి నిజాయితీగా డబ్బులు తిరిగివ్వడంతో గ్రామస్థులంతా ఆమె చేసిన పనిని మెచ్చుకున్నారు.