అనకాపల్లి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న నర్సీపట్నం ఋషి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 15కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులు హాజరుకావాలని తెలిపారు.