KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్, వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నజీర్ అహమ్మద్ తనపై చేస్తున్న ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఇవాళ తీవ్రంగా ఖండించారు. ఇవి అసత్యాలు, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారమని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.