VZM: తెర్లాం మండలంలోని బూరిపేట గంగాడ రహదారి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దీర్ఘకాలంగా దెబ్బతిన్న రోడ్డుతో రాకపోకలు కష్టంగా మారిన పరిస్థితికి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమై వేగంగా సాగుతున్నాయి. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, సహకరించిన ఎమ్మెల్యే బేబీనాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజాకు కృతజ్ఞతలు తెలిపారు.