PLD: నరసరావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం మున్సిపల్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శానిటేషన్ డ్రైవ్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.