AKP: నర్సీపట్నం ఎస్టీ బాలికల వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. ఇంట్లో మహిళలను గౌరవించినట్లే సమాజంలో మహిళలందరినీ గౌరవించాలని సూచించారు. బాలికలు చదువు మీద దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.