KKD: ఇక నుంచి ప్రతి శనివారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి PGRS నిర్వహిస్తామని కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో వారి కోసం ఇవాళ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చిన దివ్యాంగుల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత సమయంలోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.