సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.