KDP: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎల్పీజీ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతోందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సి వస్తోందని, దీని వల్ల శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.