విశాఖలోని వ్యాపారులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌లను గడువులోపు రెన్యువల్ చేసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. గడువు దాటిన తర్వాత రెన్యువల్ చేస్తే అదనపు జరిమానాలు విధిస్తామని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉండగా, ఏప్రిల్‌లో రెన్యువల్ చేసుకుంటే 50 శాతం వరకు జరిమానా విధించనున్నామన్నారు.