నంద్యాల జిల్లా డోన్ పట్టనంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు సామాజిక న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ సంపదను పునర్పంపిణీ చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లింగ వివక్షను నివారించాలని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు.