CTR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కె. శేఖర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల మేరకు.. గిరింపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శేఖర్ శివరాత్రి రోజున మద్యం తాగడంతో అతని భార్యతో వాగ్వాదం జరిగింది. దీంతో శరీరంపై శేఖర్ ఆయిల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.