కృష్ణా: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా కలెక్టర్ బాలాజీ శనివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం సైకిల్‌పై తన నివాసం నుంచి కలెక్టరేట్‌కు వచ్చి విధులకు హాజరవుతున్నారు. వాహనాల వినియోగం తగ్గించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు.