KDP: వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపసువుల గ్రామ ప్రధాన రహదారిలోని రోడ్డు వద్ద వాహనాల తనిఖీని నిర్వహించారు. వాహనదారుడికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ వాహనానికి సంబంధించిన రికార్డు ఉండాలన్నారు. అదేవిధంగా ఎలాంటి పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.