ప్రకాశం: ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.