ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు.గ్రూపు రాజకీయాల వల్ల రాష్ట్రంలో ఇన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ (BJP) బలపడలేకపోయిందని పురందశ్వరి తెలిపారు. పార్టీలో వర్గ పోరు రాజకీయాలు చేయవద్దని ఆమె హెచ్చారించారు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని ఆమె సూచించారు.పోలింగ్ బూత్ స్థాయి (Booth level) వరకు కమిటీలను వేసుకోవాల్సిందేనని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీలు స్థానిక సమస్యలపై ప్రజల తరపున పోరాడాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ (Pm modi) ప్రభుత్వ విజయాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలకు కూడా బాధ్యతలను అప్పగించినప్పుడే పార్టీ బలపడుతుందని చెప్పారు.క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలకు కూడా బాధ్యతలను అప్పగించినప్పుడే పార్టీ బలపడుతుందని చెప్పారు. సర్పంచ్(Sarpanch)ల సమస్యలపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన ఉద్యమం విజయవంతమయిందని.. ఈ ఉద్యమం ద్వారా మన పార్టీ గొంతుకను బలంగా వినిపించామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి వచ్చే విరాళాలను నగదు రూపంలో తీసుకోవద్దని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను(Central govt schemes) ప్రజలోకి తీసుకేళ్లాలని ఆమె కేడర్‌కి సూచించారు.