»Support For Chandrababu In Front Of Cyber Towers Brs It Staff
Cyber Towers ముందు చంద్రబాబుకు మద్దతు.. బీఆర్ఎస్ ఐటీ స్టాఫేనా..?
మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ సైబర్ టవర్స్ ముందు ఐదుగురు ఫ్లకార్డులు పట్టుకొని కనిపించారు. వారు అంతా బీఆర్ఎస్ ఐటీ స్టాఫ్ అని రుమార్లు వినిపిస్తున్నాయి.
Cyber Towers: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను చాలా మంది ఖండిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సైబరాబాద్ నిర్మించింది తాను అని.. సిటీకి ఐటీ తీసుకొచ్చింది తానేనని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. సో.. సైబర్ టవర్స్ (Cyber Towers) వద్ద కొందరు ఫ్లకార్డులు పట్టుకొని చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సో.. సిటీలో కూడా బాబుకు క్రేజ్ ఉందని అంతా అనుకున్నారు. రియాల్టీ మాత్రం వేరేలా ఉందని తెలుస్తోంది.
ఐదుగురు ఇలా
సైబర్ టవర్స్ వద్ద కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకతను హెల్మెట్ పెట్టుకొని ఉండగా.. మిగతా నలుగురి మొహాలకు మాస్క్ ఉంది. అక్కడ మూడు టూ వీలర్స్ ఉన్నాయి. విచిత్ర ఏమిటంటే ఆ వెహికిల్స్ నంబర్ కూడా కనిపించడం లేదు. ఓ స్కూటీ నంబర్ ప్లేట్ కనిపిస్తోండగా.. దాని నంబర్‌కు అడ్డుగా పేపర్ పెట్టారు. దీంతో వీరు నిజంగా ఐటీ ప్రొఫెషన్సేనా అనే సందేహాం కలుగుతుంది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సందేహాలను లేవనెత్తారు.
వెహికల్ నెంబర్ ప్లేట్ కి పేపర్ అడ్డం… వీళ్ళ మోకాలికి మాస్క్‌లు… నిజం చెప్పు ఇది మన పార్టీ IT స్టాఫ్ ఎహ్ గా @KTRBRS 🧐… మరి ఇంత దిగ్గజరాల బాబాయ్ 🥹… pic.twitter.com/SfEsC5y7AJ
ఐటీ స్టాఫేనా..?
వీరు బీఆర్ఎస్ ఐటీ స్టాప్ (brs it staff) అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరీ ఇంత దిగజరాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు. నిజమే.. బాబు అరెస్ట్‌ను ఖండిస్తే డైరెక్ట్‌గా ఖండించాలి కానీ.. ఇలా ముసుగులో గుద్దులాట ఎందుకు అని కొందరు ప్రశ్నించారు. ఏ విషయం ఉన్నా సరే.. సూటిగా స్పష్టంగా చెప్పాల్సిందని అభిప్రాయ పడుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అదీ ఈ రోజు విచారణకు రానుంది.
అవినీతిపై మంత్రి కేటీఆర్- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. టీ కాంగ్రెస్ ఫండింగ్ కోసం కర్ణాటక ప్రభుత్వం కష్టపడుతోందని కేటీఆర్ అనగా.. కల్వకుంట్ల స్కామిలీ అంటూ రేవంత్ మొదలెట్టారు.