CTR: కుప్పం MPDO కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే PGRSలో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.