ATP: జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, హెల్త్ అధికారి శ్రీరాములు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థల పరిసరాల్లోని దుకాణాలను తనిఖీ చేశారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని యజమానులను హెచ్చరించారు.