GNTR: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తు దారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసామన్నారు.