NDL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన APAIMS -2.0 యాప్ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోవెలకుంట్ల డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ సుధాకర్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.