W.G: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ నాగరాజు సూచించారు. భీమవరంలో శ్రీ చిమట నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా జీవించాలని సీఐ నాగరాజు అన్నారు.