TPT: కొత్తపేటలోని ద్వారకానగర్‌లో ఆదివారం నిర్వహించనున్న జల్లీ కట్టు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఇసుక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతకు నిర్భాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.