కోనసీమ: అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పీ. శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొన్నారు.