W.G: పెనుగొండ (M) కొఠాలపర్రులో ఉపాధి హామీ పథకం కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం సమావేశమయ్యారు. కూలీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో ఈ- KYC విధానాన్ని తీసుకువచ్చి కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు.