కంభంలో దివ్యాంగ చిన్నారులు తమ లోపాలను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు భవిత కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని ఎంఈఓ-2 శ్రీనివాసులు అన్నారు. బుధవారం స్థానిక బోర్డు స్కూల్ భవిత కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, సామాజిక స్పృహలను పరిశీలించారు.