విశాఖలో మంగళవారం తెలంగాణ సీఐటియు నేత, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రోజారాణి అంతిమయాత్ర భావోద్వేగంగా సాగింది. సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమెకు కెజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం సీపీఎం కార్యాలయంలో ఆమెకు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల సీపీఎం నేతలు, ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు హాజరై ఘనంగా వీడ్కోలు పలికారు.