VSP: ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న బొత్సను ఆయన స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స అస్వస్థతకు గురవ్వడం పట్ల వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.