ELR: ఉంగుటూరు గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ ఆదివారం తెలిపారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, కొత్త విద్యుత్తు లైన్ వేస్తామన్నారు. ఊర చెరువు దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాల వన్, అంబేద్కర్ బొమ్మ దగ్గర, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ ఏరియాలో నిలుపుదల చేస్తున్నామన్నారు.