ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్‌ను బుధవారం కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా ప్రజలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను పరిశీలించి, నిర్వహణపై అధికారులకు, సిబ్బందికి సూచనలు అందించారు. అనంతరం ఆహారాన్ని పరిశుభ్రంగా అందించాలని, ప్రజల పట్ల గౌరవంగా మెలగాలని ఆయన సూచించారు.