CTR: నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో భాగంగా 4వ రోజు నక్కనపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో గల పట్టు పరిశ్రమను ఆమె పరిశీలించారు. అనంతరం మహిళా రైతులతో సమావేశమయ్యారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆమె పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.