CTR: అప్పటి మేయర్ దంపతులు కటారి అనురాధ, మోహన్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిందని, దీనిని స్వాగతిస్తున్నట్లు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. తన అత్తమామలను దారుణంగా హత్య చేసినప్పటి నుంచి న్యాయ పోరాటం చేశామని, చివరకు గెలిచామన్నారు. A1 నుంచి A5 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించిందని, ఈనెల 27న శిక్ష ఖరారు చేయనున్నట్లు వివరించారు.