KRNL: ఆలూరులోని క్యాంప్ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను సోమవారం టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పంపిణీ చేశారు. ప్రజలకు అత్యవసర సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆలూరు ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల్లో ఐదోసారి చెక్కుల పంపిణీ చేయడం తనపై మరింత బాధ్యతను పెంచిందని వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు.