W.G: ఇరగవరం(మం) రేలంగిలో శుక్రవారం ఆటోలో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని అటుగా వెళ్తున్న తణుకు ఎమ్యెల్యే రాధాకృష్ణ గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన కుటుంబానికి సహాయం చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే, వైద్యులకు ఫోన్ చేసి తక్షణ చికిత్స అందించాలని సూచించారు.