PLD: వ్యాపార అవసరాల కోసం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పల్నాడు జిల్లా సరఫరా అధికారి (DSO) ప్రసాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర వాణిజ్య స్థాపనల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.