PLD: మాచర్ల మండలం విజయపురి సౌత్‌లోని సాగర్ క్యాంప్, లంకమోడు తదితర ప్రాంతాలలో దాదాపు రూ.3.59 కోట్ల వ్యయంతో సీసీ, బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనుల పురోగతిని వార్డుల వారీగా ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు రవాణా సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.