Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ కావడంతో అధికార వైసీపీ నేతలు ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్‌గా స్పందించారు. చంద్రబాబుకు 7691 నంబర్ ఇవ్వగా.. దానికి విజయసాయి కొత్త అర్థం ఇచ్చారు.
ఖైదీ నంబర్ 7691 కలిపితే 23 వస్తోంది. అంటే 2023 అన్నమాట.. ఇదే మీకు రాజకీయంగా చివరి సంవత్సరం అని విజయసాయి రెడ్డి అంటున్నారు. 2024 నుంచి ఇక రాజకీయాల్లో కనిపించరని చెప్పకనే చెప్పారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ ఎంత మనోవేదన చెందారో.. ఇప్పుడు ఆయనకు అర్థం అయ్యి ఉంటుందని ట్వీట్ చేశారు. చేసిన పాపం ఊరికే పోతుందా అని మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్ట్ కావడంతో వైసీపీ మంత్రులు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి రోజా టపాసులు కాల్చి, కేక్ కట్ చేశారు. లక్ష్మీ పార్వతి అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. మిగతా ముఖ్య నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో స్కామ్ జరిగిందని.. రూ.300 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు అంటున్నారు. అవినీతి కారణం అప్పటి సీఎం చంద్రబాబు అని.. అరెస్ట్ చేశారు.