SKLM: టెక్కలి (M) సీతాపురం గ్రామానికి చెందిన యం.నారాయణమ్మ (74) అనే వృద్ధురాలు పాము కాటుకు గురై మృతిచెందింది. కుటుంబసభ్యుల వివరాలు మేరకు.. వృద్ధురాలు కంటి చూపు సరిగా లేకపోవడంతో ఇంట్లోకి పాము ప్రవేశించడం గమనించలేదు. దీంతో ఆమెను పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.