GNTR: మంగళగిరిలో తెనాలిరోడ్డు 60 అడుగుల మేర విస్తరిస్తే ఉపాధి కోల్పోతామని స్థానిక చేనేత వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణ వల్ల కలిగే ఇబ్బందులను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.