NLR: ASపేట ఎంపీడీవో కార్యాలయానికి జిల్లా పంచాయతీ అధికారిణి డి.వసుమతి గురువారం వచ్చారు. పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. పొదుపు మహిళలు, అంగన్వాడీ సిబ్బందిని సమన్వయం చేసుకుని మార్చి 20వ తేదీ లోపు 100% ఇంటి పన్నుల వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ప్రసన్నకుమారి, డిప్యూటీ ఎంపీడీవో మునిరత్నం, కార్యదర్శులు పాల్గొన్నారు.