GNTR: ప్రత్తిపాడులో బకాయి పడ్డ జీతాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు ఇచ్చే వరకు పనిలోకి రావద్దని గతంలో చెప్పిన మేస్త్రి, ఇప్పుడు ట్రాక్టర్‌తో చెత్త ఎత్తించడంపై కార్మికులు మండిపడ్డారు. నిరసనగా చెత్త ట్రాక్టర్‌ను కదలకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.