ప్రకాశం: గిద్దలూరులో రాక్సీ జాగిలంతో గురువారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్శిల్ సెంటర్, పాతాళ నాగలింగేశ్వర స్వామి టెంపుల్, ఒక పాత బిల్డింగ్‌లో, దిగుమెట్ట తాండ పరిసర ప్రాంతాలలో రాక్సీ డాగ్‌తో విస్తృతంగా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రయాణికుల బ్యాగులను ఓపెన్ చేయించి చెక్ చేశారు.